Thursday, April 23, 2009

ఆర్దిక మాంద్యం నాకు తగిలింది

ఆఫీసు లో వారం రోజులనుంచి ఒకటే సందడి అందరు తెగ కష్టపడి పని చేస్తున్నారు ఎలాగు పని లేని నేను వీళ్ళు ఏమి పని చేస్తున్నారా తెలుసుకుందాం అనే పని లో పడ్డాను. ఇంతలొ మా ప్రసాదు కంగారు కంగారూగా కీ బోర్డు ని చావా బాదుతున్నాడు సరే మాస్టారిని కలిస్తే విషయమం ఏంటో తెలుస్తూంది కదా అని కదిలించాను. కీ బోర్డు మీద చెయ్యి , మానిటర్ లో తల తీయ్యాకుండా అమెరికా నుంచి మేనేజర్ లు వచ్చారు అని శుభవార్త చెప్పాడు ఎగిరి గంతు వేసిన అంట పని చేశాను ( వాళ్లు వచ్చినదుకు కాదు ఏమి అన్నా జీతం పెంచుతారు ఏమో బుల్లి నానో కారు కొనడం అని ) ఆరు నెలల నిరీక్షనకీ ఈ రోజుతో ముగింపు అనుకున్నా, కాని అది మరో వారం పెరిగింది వాళ్ళు ఒక వారం రోజులు ఇక్కడే ఉంటారు వెళ్ళే రోజు జీతాలు గురించి మాట్లాడతారు అని అభిజ్ఞ వర్గాల ద్వార తెలిసింది. సరే అని ఎదురు చూడటం కంటే చేసిది లేదు అని ఎదురుచూడటం మొదలు పెట్టాను.

ఇంతలో ఆ రోజు రానే వచ్చింది, అమెరికా నుంచి వచ్చిన మేనేజర్ లోపలకి పిలిచాడు తోలిప్రేమ సినిమా లో పవన్ కళ్యాణ్ టైపులో బాత్రూంలోకి వెళ్లి చిన్న సైజు స్టెప్స్ వేసి రూమ్ లోకి వెళ్ళాను. ఎప్పటిలగానీ అర్ధం కాని ఇంగ్లీష్ లో ఏదో చిన్నగా చెప్పి కుర్చీ చూపించాడు, అప్పుడు అర్ధం అయ్యింది నన్ను కూర్చోమన్నాడు అని వెంటనే కూర్చున్న లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ. మెల్లగా బ్రెడ్ కీ జామ్ రాసినట్టు పొగడటం మొదలు పెట్టాడు లోలోపల మనకి అంతుందా అనుకుంటూనే విన్న ఎంత అయిన పొగుడుతూ ఉంటే బాగుంటుంది కదా!!!! సరే కంటిన్యూ కంటిన్యూ అన్నా. కొంచం సేపటికి ఒక లెటర్ చేతిలో పెట్టాడు నీకు అయిదు వేలు పెంచుతున్నాం అని ఎగిరి గంతు వేద్దాం అనుకున్నా అలా చేస్తే బాగోదు అని ఎక్కువ సంతోషం మొహం లో కనపడనివ్వకుండా ఇంతేనా అని అన్నట్టు ఒక ఎక్స్ ప్రెషన్ పెట్టాను. సెకండ్ లో నీకు ఇదే ఎక్కువ అనే ఎక్స్ ప్రెషన్ పెట్టాడు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఏమి అడుగుతాడో అని సెలవు తీసుకుని బయటపడి హమ్మయ అని కళ్లు మూసుకున్న, ఇంతలో ఏదో పెద్ద బీరువా జరిపినట్టు సౌండ్ వచ్చింది కళ్లు తెరిచి చుస్తే ఆఫీసు లో అమ్మాయి లో ఏదో జోక్ కీ నవ్వుకుంటున్నారు నేను ఉంది మేనేజర్ రూమ్ బయట కాదు కఫ్తెరియాలో , అప్పుడు అర్ధం అయ్యింది ఇందాకటి నుంచి జరిగింది కల అని. అయిన జరగబోయేది అదే కదా అని నాలుగోవ టి తాగాను.

ఈసారి మేనేజర్ నిజంగా పిలిచాడు నా ఒక్కడినే కాదు ఆఫీసు అందరిని. ఇది ఏదో బాగుంది గుంపులో గోవింద లాగా కాగితం తీసుకోవచ్చు స్పెషల్ గా ప్రశ్నలు ఏమి ఉండవు అని లోలోపల సంతోష పడుతూ వెళ్ళాను. మేనేజర్ అందరిని ఉద్దేశించి మీకు తెలుసు ప్రస్తుతం అమెరికా అర్దికంగా కష్టాల్లో ఉన్నది అని అందువల్ల ఈసారి జీతాల్లో ఎలాంటి మార్పులు చెయ్యటం లేదు అని కేంద్ర మంత్రి పోయినప్పుడు టీవీ లో వార్తలు చదివే వాడి అంతలా ఎక్స్ ప్రెషన్ పెట్టి మరి చెప్పాడు. అన్ని ప్లాన్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కులిపోయినాయి. ఛి అనుకుని వెంటనే అయిదవ టి తాగి క్యూబ్ కీ వచ్చి చాటింగ్ మొదలు పెట్టాను మరో ఆరు నెలల వెయిటింగ్ ని తలచుకుంటూ.

జాలము - తెలుగు సైట్ల, బ్లాగుల డైరక్టరీ
నా సైటు రివ్యూ చేయండి

నా మొదటి టపా

సెంట్రల్ గవర్నమెంట్ లాంటి సాఫ్ట్ వేరు జాబ్ తొమ్మిది గంటలు ఆఫీసు అరగంట పని ఇంతకాలం పని చెయ్యటమే కష్టం అనీ ఫీలింగ్ లో ఉండే వాడిని పని లేకుండా కూర్చోవటం కూడా అంతా కంటే కష్టం అని ఎప్పుడు తెలుస్తూంది. సరే అలవాటు అయినా కాళీగా కూర్చునే పని కాకుండా ఇంకా ఏమి అన్నా వేరే పని చేద్దాం అని ఆఫీసు వాళ్లు ఇచ్చిన నెట్ మీద విశ్రాంతి లేకుండా వేటిkఆను బ్లాగ్ ఏదో కొంచం బాగున్నట్టు అనిపించిది. ఒకటి రెండు బ్లాగ్ లు చదవాగానే నాకు ఒక బ్లాగ్ మొదలు పెట్టాలి అనిపించింది కాని ఇది మన వల్ల అయ్యేలా లేదు అంతా బాష మన దగ్గర లేదులే అని వెనుక అడుగు వేసాను కానీ చాల బ్లాగ్ లు చదివన తరవాత అర్ధం అయింది పెద్దగా బాష లేక పోయిన బ్లాగ్ రాయవచ్చు అని పక్కింట్లో కుక్క పిల్ల - ఆకాశంలో కాకి పిల్ల, గోడ మిద పిల్లి -మంచంలో నల్లి, ఇంటికి కట్టిన గుమ్మడి కాయ- ఆఫీసు లో మా మేనేజర్ మాయ్యా , చెరువులో చేప- ఆఫీసులో పాప, ఎదురు ఇంట్లో ముద్దుగుమ్మమన ఇంట్లో మూలాపడ్డ మామ్మ దేని గురించి అయినా రాయచ్చు అని తెలుసుకుని నేను కూడా మొదలుపెట్టాను. రాబోవు టపా లో కలుద్దాం